ప్రముఖ పోస్ట్‌లు

9, మార్చి 2011, బుధవారం

ప్రశ్నార్ధకం ?????

దేవా !మాతృత్వం వరమా?
అయ్యో! ఆడపిల్ల అని
కడుపులోనే చంపేస్తారేమో ?

అమ్మో! కాలేజీ చదువా?
రాగింగ్ చేస్తారేమో?

ఓరినాయనో ! ప్రేమా?
యాసిడ్ పోస్తారేమో ?

అమ్మబాబోయ్ ! పెళ్ళా !
కట్నం పేరుతో కాల్చేస్తారేమో?

ఇదీ ప్రస్తుత సమాజంలో
సగటు వనితల
ఆందోళన, ఆవేదన ..ఆక్రందన..!!!